SRPT: కోదాడ ఆవోప చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ సూర్యాపేట జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వంగవీటి రామారావులు పేర్కొన్నారు. అవోపా కోదాడ 21వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం, కోదాడ పట్టణంలోని అప్పయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన సభా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.