ప్రధాని మోదీ ఈరోజు బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతాలో జరిగే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులు, ఇతర రక్షణ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం బీహార్‌లోని పూర్నియాలో కొత్త విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. అక్కడ రూ. 36,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.