TPT: తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం ఆదివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో 11 మంది సభ్యులు, ఎక్స్ అపిషియో సభ్యులు పూజారి మురళీ స్వామితో పాటు ఛైర్మన్ మహేష్ యాదవ్ నేతృత్వంలో దేవాదాయ శాఖ చట్టం 1987 ప్రకారం సభ్యులు ప్రమాణం చేశారు.