KDP: బద్వేలు పురపాలకలోని వార్డు సచివాలయాల్లో వాహన మిత్ర పథకం కింద సాయం పొందేందుకు అర్హులైన ఆటో,టాక్సీ డ్రైవర్లు ఈనెల 17వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ నరసింహారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలన్నారు.మోటార్ క్యాబ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు. దరఖాస్తులను వార్డు సచివాలయాల్లో అందజేయాలన్నారు.