KDP: జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద డోన్ పట్టణంలో వెటర్నరీ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేక గాలికుంటు టీకాల కార్యక్రమం నిర్వహించారు. పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థిక స్థిరత్వానికి పునాదిలాగా ఉందని అన్నారు. గాలికుంటు వ్యాధుల నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తున్నదని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.