AKP: అచ్యుతాపురంలో ఫ్లైఓవర్ పనుల్లో నాణ్యతను పాటించడం లేదని రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం అచ్యుతాపురంలో మాట్లాడుతూ.. అధికారులు లేకుండా పనులు జరుగుతున్నాయన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. నిబంధనలు పాటించకపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన తెలిపారు.