‘ఫలానా పని చేయడానికి నేను సమర్థుణ్ని కాదు. అందుకు అవసరమైన నైపుణ్యాలు, అనుభవం నాకు లేవు’ అని మీకు మీరు చెప్పుకుంటూ ఆగిపోకండి. ఓ పనిని మొదలుపెట్టిన తర్వాతే అందులో అనుభవం గడిస్తారు. ఏ పనినైనా నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం దాన్ని చేయడమే అని గుర్తించుకోండి. మీకు నచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.