BDK: పినపాక తహసీల్దార్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు MRO గోపాలకృష్ణ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నారు. అన్ని శాఖల మండల అధికారులు సకాలంలో హాజరుకావాలని ప్రకటించారు.