ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద ఇవాళ్టి నుంచి అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేపట్టనున్నట్లు సహాయ సంచాలకులు రవిబాబు తెలిపారు. రైతు సేవా కేంద్రాల పరిధిలోని బృందాల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ఆవులు, గేదెలకు టీకాలు వేయనున్నట్లు వివరించారు.