కర్నూలు: వ్యవసాయ మార్కెట్ యార్డులో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో జరిగిన ఉల్లి బహిరంగ వేలంలో 1500 టన్నుల కొనుగోళ్లు జరిగాయని జాయింట్ కలెక్టర్ డా. నవ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇవాళ మార్కెట్కు ఉల్లి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, అందుకే సెప్టెంబర్ 16న మార్కెట్ యార్డు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.