GNTR: పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రోల్ కాల్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పోలీస్ సిబ్బంది చక్కని యూనిఫామ్ ధరించి, సమయపాలన పాటించాలని, ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ సూచించారు.