మహ్మద్ సిరాజ్ ప్రతిష్ఠాత్మక ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ పోటీలో ఉన్నప్పటికీ.. వారిని వెనక్కి నెట్టి సిరాజ్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన సచిన్-ఆండర్సన్ ట్రోఫీలో సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి.. ఆగస్టు నెలకు గాను ఈ అవార్డు గెలుచుకున్నాడు.