TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాసేపట్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.