కృష్ణా: శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పల్లపోతు అభిషిక్త, శ్రీరామ్‌ల సహకారంతో గుడివాడ నాగవరప్పాడులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించి సోమవారం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు తిరుపతయ్య, రాష్ట్ర యాదవ సంఘం ఉపాధ్యక్షులు మునీంద్ర,జాజుల తాతారావు పాల్గొన్నారు.