KDP: మహిళల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని టీడీపీ నాయకుడు సైఫుల్లా అన్నారు. బుధవారం వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తాళ్లపల్లి పీహెచ్సీ వైద్యుడు డా. పృధ్వీకుమార్ రెడ్డి పాల్గొని ప్రజలకు వైద్యం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.