ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గల ఆర్వో ప్లాంట్ మరమతులకు గురైంది. దీంతో పాఠశాల విద్యార్థులకు మంచినీటి సదుపాయం లేక ఇబ్బందిగా మారింది.. విషయం తెలుసుకున్న వాటర్ ప్లాంట్ అసోసియేషన్ సభ్యులు పాఠశాలలోని ఆర్వో ప్లాంట్‌కు సోమవారం మరమ్మతులు చేపించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ అసోసియేషన్ సభ్యులు, ఎంఈవో సత్తార్ పాల్గొన్నారు.