NZB: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీ. సాయి చైతన్య మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించిందని తెలిపారు.