కోనసీమ: అనుమతులు లేకుండా దీపావళి క్రాకర్స్‌ను నిలవ ఉంచితే చర్యలు తీసుకుంటామని ఆలమూరు ఎస్సై నరేష్ తెలిపారు. ఆలమూరు మండలం జొన్నాడలో ఓ రేకుల షెడ్డులో అనుమతులు లేకుండా ఉంచిన ఫైర్ క్రాకర్స్‌ను గుర్తించి వాటిని పోలీసులు సీజ్ చేశారు. యజమానిపై కేసు నమోదు చేశామని సీజ్ చేసిన క్రాకర్స్ విలువ రూ. రెండు లక్షల వరకు ఉంటుందని తెలిపారు.