SRD: మనూర్, నాగలగిద్ద మండలాల్లో కురిసిన అధిక వర్షానికి, సింగూర్ బ్యాక్ వాటర్ ద్వారా నీట మునిగిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోమవారం సబ్ కలెక్టర్ ఉమా హారతికి వినతి పత్రం అందజేశారు. సింగూర్ బ్యాక్ వాటర్ ద్వారా పత్తి, పెసర, మినుము, సోయా పంటలు నీట మునిగాయన్నారు. ప్రభుత్వం తరఫున వెంటనే నష్ట పరిహారం అందించాలని కోరారు.