VKB: ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వల్ల బస్సులు, భారీ వాహనాలు మలుపు తిరగడానికి ఇబ్బందులు పడటంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, విగ్రహాన్ని కాస్త పక్కకు జరిపి ప్రతిష్టించే పనులు జరుగుతున్నాయి.