GDL: మల్దకల్ మండల కేంద్రం నుంచి మద్దెలబండ గ్రామం వరకు బీటీ రోడ్డు అధ్వానంగా ఉందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పేర్కొన్నారు. రోడ్డుపై ప్రయాణించడం వల్ల రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. మద్దెలబండ, పెంచికలపాడు, ఆరగిద్ద, గట్టు గ్రామాల మీదుగా వెళ్లే ఈ రోడ్డును వెంటనే మరమ్మతు చేయించి, ప్రమాదాలను అరికట్టాలాంటూ వారు కోరుతున్నారు.