NGKL: విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ అన్నారు. సోమవారం కల్వకుర్తిలోని న్యూ ఎరా జూనియర్ కళాశాల, అంబేడ్కర్ పారా మెడికల్ కళాశాలలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.