MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల విద్యార్థులకు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీ ఇందిరా హాజరయ్యారు. విద్యార్థులకు చట్టపరమైన అంశాలు, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. అధికారులు పాల్గొన్నారు.