WNP: వికలాంగులు పీఎం దక్ష యోజనలో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రజిని అన్నారు. పెబ్బేరు మండలంలోని వికలాంగుల పునరావాస కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మానసిక, శారీరక బాల్య దివ్యాంగులను పునరావాస కేంద్రాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.