SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం తన కార్యాలయంలో జాతీయ గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15 వ తేదీ నుండి అక్టోబర్ 15 వరకు అన్ని గ్రామాల్లో యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పశు సంవర్ధక రంగం బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు.