VKB: తాండూర్ పట్టణంలోని శివాజీ చౌక్ సమీపంలో సోమవారం రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని TS 34 T 4999 నంబర్ గల సిమెంట్ ట్యాంకర్ ఢీకొంది. ప్రమాదంలో ఆ వ్యక్తి తలకు తీవ్ర గాయం అయ్యింది. స్పందించిన స్థానికులు 108 అంబులెన్సు సమాచారం అందించారు. దీంతో వ్యక్తిని వెంటనే తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.