TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన కనకాచలం కొండపై ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు కనకదుర్గాంబ అమ్మవారి దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈవో బాపిరెడ్డితో కలిసి గోడపత్రికలను ఆవిష్కరించారు. దక్షిణామూర్తి సన్నిధి వద్ద గోడపత్రికలకు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.