GNTR: ఎన్నికల హామీల ప్రకారం ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పొన్నూరులో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పొన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు రామారావు, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.