W.G: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా)ఆధ్వర్యంలో సోమవారం తణుకులో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకులోని ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు 54 మందిని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఘనంగా సత్కరించారు. ఇందులో అసోసియేషన్ నాయకులు ప్రగతి రాజా, ఎల్.కె.త్రిపాఠి పాల్గొన్నారు.