NLR: ఉదయగిరి దుర్గం అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీపై సోమవారం పోలీస్, అటవీ, ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అక్కడ నిలువ ఉంచిన సుమారు 200 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. సారా బట్టీలు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.