KNR: హుజురాబాద్‌లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బాల్య మిత్రులు 41 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తాము కలిసి చదువుకున్న రోజులు, పాఠశాలలో గడిపిన క్షణాలు, పంచుకున్న సరదాలు, కష్టాలు అన్నీ గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.