NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం గ్రామానికి చెందిన గంట్ల నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి మధు రెడ్డిలు క్రీడా దుస్తులను అందజేశారు. దాతల తండ్రి స్వర్గీయ గంట్ల రామ్ రెడ్డి జ్ఞాపకార్థం వారు విద్యార్థులకు దుస్తులను అందజేయటం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.