ASF: కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని CPM నియోజకవర్గ కన్వీనర్ ఆనంద్ కుమార్ అన్నారు. CITU ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు వేతనాలు అందకపోవడం బాధాకరమన్నారు. ప్రజా ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.