ATP: రాయదుర్గం మండల వ్యాప్తంగా స్మార్ట్ కార్డుల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టగా 55 రేషన్ దుకాణాల పరిధిలో పంపిణీ జరుగుతోంది. మండలానికి 32 వేల కార్డులు వచ్చాయని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. వీటిని డీలర్లు, వీఆర్వోలకు పంపిణీ చేశారు. గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.