AP: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను సీపీఎం నేతలు కలిశారు. ఈ భేటీలో జాన్ బ్రిటాన్, వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను సీపీఎం నేతలు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు.