WGL: వర్ధన్నపేట పట్టణంలో RTC బస్సులో ఓ ప్రయాణికుడి బ్యాగ్ దొంగిలించబడిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. తొర్రూరు నుంచి వరంగల్ వెళ్లేందుకు బస్సులో సతీష్ ప్రయాణం కొనసాగుతుండగా వర్ధన్నపేట బస్టాండ్లో రాగానే తన ల్యాబ్ టాప్ బ్యాగ్ కనిపించకపోవడంతో బస్సును ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ పోటెజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.