MHBD: గడ్డిగూడెం తండాలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపింది. భార్య తన ఇంస్టాగ్రామ్ ప్రియుడితో కలిసి భర్తపై ఆత్మహత్యయత్నం చేసింది. భర్త ప్రాణ భయంతో పరుగులు తీసి స్థానికులకు తెలపడంతో వారు ఇంస్టాగ్రామ్ ప్రియుడిని వెంటాడి పట్టుకొని, చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించారు. బాధితుడు MHBD ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.