WGL: పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు పీఎం ఆవాస్ యోజన పథకం వర్తింపజేయడానికి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ మంగళవారం సర్వే చేపట్టారు. ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విక్రమ్, గ్రామస్థులు వెంకన్న, కొంరయ్య, రాజు పాల్గొన్నారు.