RR: ఆడపడుచులకు ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ పండుగ అని మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి అన్నారు. కొత్తపేట జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన్సురాబాద్ పెద్దచెరువు ప్రాంగణంలో బతుకమ్మ పండుగ కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు.