ఆసియా కప్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో గ్రూప్-A నుంచి.. UAE, ఒమన్ జట్లు తలపడనున్నాయి. అలాగే, రాత్రి 8 గంటలకు గ్రూప్-Bలోని.. శ్రీలంక, హాంకాంగ్ జట్లు పోటీపడతాయి. ఇప్పటికే ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలంక.. ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే సూపర్-4కు దాదాపు చేరుకుంటుంది.