JGL: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. తాజా కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా వచ్చిన 11 మంది అర్జీదారుల ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి వివరాలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు.