KMM: ఎర్రుపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంగణంలో ఈ నెల 17న విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏడీఏ అనురాధ సోమవారం తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించి సమస్యలను విద్యుత్ వినియోగదారులు లిఖితపూర్వకంగా దరఖాస్తులను అందజేయవచ్చని చెప్పారు. ఫిర్యాదులను ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.