VSP: తెలుగును పాఠ్యాంశంగా కాకుండా ప్రాథమిక విద్యాబోధనలో మాధ్యమంగా అమలు చేసి పరిరక్షించాలని “తెలుగు దండు” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం విశాఖలో వారు మాట్లాడారు. ఆంగ్ల భాషకు ప్రాధాన్యం ఇవ్వడం తెలుగుద్వేషమని విమర్శించారు. నిర్ణయం తీసుకోని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో మాతృభాష రక్షణ ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో కొనసాగిస్తామని హెచ్చరించారు.