HYD: అర్హులైన వారికి రూ.500లకే సిలిండర్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ.. గ్రేటర్ HYD పరిధిలో సుమారు 60 వేల మందికి పైగా అర్హులకు గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ రానివారు ఎక్కడికి పోవాలో తెలియటం లేదని, అధికారులు దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు.