E.G: రాజమండ్రి రూరల్ మండలంలోని గ్రామ పంచాయితీలకు గత 14 సంవత్సరాలుగా ఎన్నికలు జరగనందున ప్రత్యేక అధికారి పాలనలో ప్రజలకు సరైన సేవలు అందడం లేదని రూరల్ బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తికి అసెంబ్లీ రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసు వినతిపత్రం సమర్పించారు.