VKB: దోమ మండలం బడెంపల్లి ప్రాథమిక పాఠశాలలో పూర్వ విద్యార్థులు తమ పాఠశాల అభివృద్ధికి ముందడుగు వేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ వెంకటేశ్, ఆర్టీవో ఉద్యోగి అశోక్ విద్యార్థుల కోసం రూ. 25,000 విలువైన కలర్ టీవీ సోమవారం అందజేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దశరథ్ రూ.5,000 విలువగల టైలు, బెల్టులు, ఐడీ కార్డులు అందించాడు. పూర్వ విద్యార్థుల ఈ సేవ ఆదర్శంగా నిలిచింది.