TPT: విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని ఉమ్మడి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. పేద విద్యార్థుల కోసం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పద్మావతి ఆసుపత్రిలో పెండింగ్లో ఉన్న 20 శాతం పనులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.