W.G: నెల్లూరు నుండి భీమవరం మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు వెళ్తున్న AP 39JX3375 నంబర్ కారు భట్లమగుటూరు రోడ్డు వద్ద అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు, క్రేన్ సహాయంతో పంటపొలాల్లో ఉన్న కారును రోడ్డుపైకి తీసుకొచ్చారు.