AP: సంక్షేమ హాస్టళ్లలో IIT కోచింగ్‌పై కలెక్టర్లు దృష్టి పెట్టాలని CM చంద్రబాబు సూచించారు. మంచి కోచ్‌లను ఏర్పాటు చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇంటర్ తర్వాత చదువులకు పావలా వడ్డీకే రుణాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తక్కువ వడ్డీ విద్యా రుణాలకు సంబంధించి కేంద్ర పథకం ఉందని అన్నారు. విద్యా రుణాలపై త్వరలో పథకం తీసుకువస్తామని వెల్లడించారు.