AP: స్త్రీశక్తి పథకం దిగ్విజయంగా నెలరోజులు పూర్తి చేసుకుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు 3.17 కోట్ల మంది స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఈ పథకం వల్ల నెలలోనే మహిళలకు రూ.118 కోట్ల లబ్ది చేకూరిందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు.